మరో టీవీ సీరియల్ నటుడికి కరోనా..!

-

క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త రెండున్నర నెల‌లుగా సినీ ఇండ‌స్ట్రీలో, టీవీ రంగంలో ఎలాంటి షూటింగ్‌ లు జ‌ర‌గ‌లేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఈ మధ్యనే షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే ఓ తెలుగు సీరియల్ నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ షూటింగ్ నిలిచిపోయింది.

యూనిట్ సభ్యులను క్వారంటైన్ కు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా హరికృష్ణ అనే మరో తెలుగు సీరియల్ నటుడికి కూడా కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న గృహలక్ష్మీ సీరియల్‌ షూటింగ్‌​ ను రద్దు చేసారు. అయితే కరోనా సోకిన ప్రభాకర్‌తో హరికృష్ణ సన్నిహితంగా ఉన్నారని సమాచారం. ఇక హరికృష్ణకు పాజిటివ్ రావడంతో టీవీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version