త్వరలో తెలంగాణా మంత్రి వర్గ విస్తరణ…?

-

తెలంగాణాలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరిగే సూచనలు కనపడుతున్నాయి. కేబినేట్ లోకి యువ మంత్రులను తీసుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నట్టు సమాచారం. రాజకీయంగా బలంగా ఉన్న తెరాస పార్టీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టింది. సీనియర్ నేతలను సలహాలకు వాడుకోవాలని యువనేతలకు పదవులు ఇచ్చి ఉమ్మడి జిల్లాల్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దింపాలని కెసిఆర్ భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని కెసిఆర్ భావిస్తున్నారు. త్వరలో కేబినేట్ ని విస్తరించి హైదరాబాద్ పరిధిలో ఉన్న ఒక యువనేతను కేబినేట్ లోకి తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరిని ని కేబినేట్ లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తర్వాత ఆయనతో పాటుగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను కూడా కేబినేట్ లోకి తీసుకోవాలని,

ఆమెతో పాటుగా… పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని పార్టీలోకి తీసుకోవాలని కెసిఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే వికారాబాద్ జిల్లా కు చెందిన యువ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని, కోడంగల్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన పట్నం నరేందర్ రెడ్డిని మరికొందరిని కేబినేట్ లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎక్కడా అసంతృప్తులు లేకుండా చూసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కెసిఆర్.

అలాగే కొందరిని ఎమ్మెల్సీలు గా చెయ్యాలని కూడా కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ లు గా కొందరికి పదవీ కాలం ముగుస్తుంది. వారికి వేరే చోట అవకాశం ఇచ్చి కొందరు యువనేతలను మండలికి పంపాలని కెసిఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. అయితే కవితకు ముందు రాజ్యసభ ఇస్తారని అనుకున్నా దానిపై స్పష్టత రావడం లేదు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ది కూడా అదే పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Exit mobile version