తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

-

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మున్నిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. జనవరి 22న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 25న ఓట్లను లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడతాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఈనెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 31వ తేదీన జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తారు. జనవరి 1న మున్సిపల్‌ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం, వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ముఖ్యమైన తేదీలు

జనవరి 7: నోటిఫికేషన్ విడుదల
జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్ స్వీకరణ
జనవరి 11: నామినేషన్ల పరిశీలన
జనవరి 12, 13: తిరస్కరణకు గురైన నామినేషనన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం
జనవరి 14: నామినేషన్ల ఉపసంహరణ గడువుజనవరి 22: ఎన్నికల పోలింగ్
జనవరి 25: ఫలితాల ప్రకటన

Read more RELATED
Recommended to you

Exit mobile version