యువతులతో డ్రగ్స్‌ డెలివరీ : సందీప్‌ శాండిల్య

-

రాష్ట్రంలో యువతులతో కొందరు డ్రగ్స్ డెలివరీ చేయిస్తున్నారని నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత నగదు చెల్లింపులు జరుపుతున్నారని.. ఆ డబ్బును అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. గత 3 నెలలకు పైగా ఈ ముఠాపై నిఘా పెట్టి ఎట్టకేలకు ముగ్గురిని పట్టుకున్నట్లు వివరించారు.

టోలీచౌకి ప్రాంతంలో డ్రగ్స్ డెలివరీ చేసిన యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు సందీప్ శాండిల్య వెల్లడించారు. గత 5 ఏళ్లుగా డ్రగ్స్ ద్వారా నైజీరియాకు వెళ్లిన డబ్బుల వివరాలు సేకరించినట్లు తెలిపారు. భారత్‌తో పాటు అమెరికాలో నైజీరియన్లు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని.. డ్రగ్స్ కావాలని కస్టమర్లు డబ్బులు చెల్లించే లావాదేవీల ద్వారా నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. 5 సంవత్సరాల్లో డ్రగ్స్ కోసం భారత్‌-అమెరికా-నైజీరియన్ల మధ్య కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు సందీప్ శాండిల్య వెల్లడించారు. ఫారెక్స్‌ ఏజెంట్ల సహకారంతో నైజీరియన్లు డబ్బులను విదేశాలకు తరలిస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version