తెలంగాణలోని పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ ఐ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి అంటే ఇవాల్టి వచ్చేఏడాది జనవరి 3వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
ఈవెంట్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు తమకు నిర్దేశించిన కేంద్రానికి వెళ్లి ఉదయం 6 గంటల లోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం, అడ్మిట్ కార్డు, పార్ట్-2 అప్లికేషన్ ఫారం తో పాటు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాలి. ఈ పత్రాలపై తప్పనిసరిగా సెల్ఫ్ అటేస్టేడ్ చేసి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తప్పనిసరి.