దేశంలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం మర్కాజ్ యాత్రకు వెళ్ళిన వారే ప్రధాన కారణం అనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళను బయటకు రావాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నా సరే వాళ్ళు మాత్రం ఇళ్ళ నుంచి బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని విధాలుగా చెప్పినా సరే వాళ్ళు అర్ధం చేసుకోవడం లేదు.
పోలీసులు, ఆశాకార్యకర్తలు పట్టుకోవడానికి వెళ్ళగా వారి మీద దాడులకు కూడా దిగుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ దియో బంద్ కి వెళ్లి వచ్చిన వాళ్లకు కూడా కరోనా సోకింది. నిజాముద్దీన్ కి వెళ్లిన వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళారు. తెలంగాణా ఏపీ నుంచి కొందరు నిజాముద్దీన్ కి వెళ్ళకుండా దియో బంద్ కి వెళ్ళారు. దీనితో వీళ్ళకు కరోనా సోకింది అనే అనుమానం వ్యక్తమవుతుంది. దియో బంద్ సహా అజ్మీర్ దర్గాకు కూడా వెళ్ళారు.
అదిలాబాద్ జిల్లాలో ఇద్దరికీ కరోనా సోకడానికి ఇదే కారణం అని గుర్తించారు. దీనితో ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణా పోలీసులు వాళ్ళ లెక్కలను బయటకు తీస్తున్నారు. వాళ్ళ సమాచారం మీద ఇప్పటికే ఆశా కార్యకర్తలు కూడా పని చేస్తున్నారు. ఇంకా ఎంత మంది వెళ్ళారు, ఎవరు ఎవరు బయటకు రావడం లేదు అనే దాని మీద వివరాలు సేకరిస్తున్నారు. బయటకు రాకపోతే దొరికితే మాత్రం కేసులు కూడా పెట్టాలని భావిస్తున్నారు.