నేడే తెలంగాణ పాలిసెట్‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ లింక్ ఇదే

-

తెలంగాణ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్ర పాలిసెట్‌ 2022 ఫ‌లితాల‌ను ఇవాళ ఉద‌యం 11.30 ల‌కు విడుద‌ల చేయ‌నున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక, శిక్షణ విద్యా మండలి ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

పరీక్షకు హాజరైన విద్యార్థులు https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి ఈ పాలిటెక్నిక్‌ కామన్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌ (TS POLYCET Results)ను నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో వ‌చ్చిన ర్యాంక్‌ ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ సారి రెండు వేర్వేరు ర్యాంకులు జనరేట్‌ చేస్తారు. పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version