రాష్ట్రంలో వరి ఎక్కువగా పండడం వల్లనే కేంద్ర ప్రభుత్వ సాయం కోరామని ఢిల్లీలో ధర్నా చేశామని చెప్పారు కల్వకుంట్ల కవిత.బిజెపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆరోపించారు.వరి రైతులను కేంద్ర ప్రభుత్వం నిండా ముంచింది అన్నారు.కేవలం మాటల్లోనే రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు.దేశంలో పండుతున్న ధాన్యంలో 40 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతుంది అన్నారు.అందుకే తెలంగాణ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నామని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు ఊహించనంత వరి ధాన్యాన్ని పండిస్తున్నారని, వారికి కనీస మద్దతు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యమని, ఆ మద్దతు తీసుకోవడం దేశంలోని అన్ని రాష్ట్రాల రైతుల హక్కు అని అన్నారు. ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆరే ధాన్యం కొనేందుకు ముందుకు వచ్చారన్నారు.బీజేపీ, కాంగ్రెస్ లు తెలంగాణ, చత్తీస్ఘడ్ మధ్య పోలికలు పెట్టాయని, కానీ చత్తీస్గడ్ కేవలం 3.5 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తుందని అదే తెలంగాణలో 80 లక్షల టన్నుల ధాన్యం పండుతుందన్నారు.