హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నారా ? మోత మోగుద్ది జాగ్రత్త !

-

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వాహనాలు బారులు తీరతాయి. ఎవరెన్ని చెప్పినా హైదరాబాద్ లో అధిక భాగం ఉండేది సీమాంధ్ర సెటిలర్లు. సీమాంధ్ర ప్రాంతం వారికి సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో దాదాపుగా వారంతా తమ తమ సొంత ఊళ్లకు బయలుదేరుతారు.అయితే కరోనా కారణంగా చాలా మంది ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో ఉండడంతో గతేడాదితో పోలిస్తే భారీ ఎత్తున రద్దీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో రోడ్డు ఖాళీగా ఉంది కదా అని వెళ్ళేవాళ్ళు భారీ స్పీడ్ తో వెళతారని భావించి తెలంగాణ ఆర్టిఏ అధికారులు కీలక చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే లోపు మూడు చోట్ల స్పీడ్ గన్ లు బిగించారు. ఈ మేరకు సంక్రాంతి పండుగ కు సొంతూర్లకు వెళ్తున్న వాహనదారులకు రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య వాహనాలు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి, అయితే నార్కెట్‌పల్లి వంతెన, సూర్యపేట బ్రిడ్జి, మునగల బ్రిడ్జి 3 స్పీడ్ డిటెక్టర్ గన్ లను ఆర్టీఏ అధికారులు అమర్చారు. ఏదైనా వాహనం 80 కిలోమీటర్ల వేగాన్ని దాటితే 1035 /- జరిమానా వేస్తారు. అలా ఒక సారి మూడు చోట్ల దొరికితే 3115/ -అప్ అండ్ డౌన్ గనుక అయితే 6200 /- జరిమానా వేసే అవకాశం ఉంటుంది. సో కార్ లలో వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version