నాలుగువేల సర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వరకూ సంక్రాంతికి పల్లెలకు, పట్టణాలకు,నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడిచాయి..ఇందుకు సజ్జనార్ తో సహా ఎందరో కృషి చేశారు..అపశ్రుతి లేని ప్రయాణాన్ని భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించి మన్ననలు అందుకున్నారు.. ఈ పండుగ వేళ అందరికీ తీపి రోజులు ఇవి.. కార్మికులారా మీకు వందనాలు! కృషి చేస్తే మీరు మరిన్ని ఫలితాలు అందుకుంటారు అనేందుకు తార్కాణమే ఈ విజయం.. జయహో టీఎస్‌ఆర్టీసీ.
ఏడు రోజుల ప్రయాణం..మొత్తం 55 లక్షల మంది ప్రయాణికులు భద్రం.. వారి ఆనందాలు మీవే..పండుగ సంతోషాలూ ఇంకాస్త పదిలం… పండగ వేళల్లో ప్రత్యేక సర్వీసుల రూపంలో రోజుకు 15.20 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఆర్జించిన వైనంపై ఇవాళ తెలంగాణ ఆర్టీసీ అబ్బురపడుతోంది.సంబురం ఆడుతోంది.ఈ నవ్వులు కార్మికులవి.. ఛార్జీల బాదుడు లేకుండానే సంస్థను ఏ విధంగా ప్రయోజనకర రీతిలో నడిపించవచ్చో నిరూపించిన సజ్జనార్ సర్ ది.. హ్యాట్సాఫ్ సర్…
తెలంగాణ ఆర్టీసీ ఈ సంక్రాంతికి మంచి లాభాలు వసూలు చేసింది.వంద కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి సమున్నత రీతిలో నిలిచింది.కొత్త ఎండీ సజ్జనార్ చేసిన కృషి ఫలించింది.దీంతో ఈ ఏడాది సంక్రాంతి ఛార్జీల భారం ఏమీ లేకుండానే ప్రత్యేక సర్వీసులు నడిపి అంతకంతకు ప్రయాణికుల ఆదరణ చూరగొంది. మీరు కష్టపడండి ఫలితాలు అందుకోండి అని కేసీఆర్ ఎప్పుడూ చెబుతారు. అదే నిజం అయింది. అవును 107 కోట్ల రూపాయలను వసూలు చేసి సంస్థ టాప్ గేర్ లో ఉంది. ఈ పండుగ కాంతులు నిజంగా ఆర్టీసీవే ! ఆల్ ద బెస్ట్ టు ఆల్.. అండ్ కంగ్రాట్స్ టు ఆల్.