యూఏఈలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశం లోకి ఎవరైనా రావాలంటే.. తప్పకుండా బూస్టర్ డోసు తీసుకుని ఉండాలని యూఏఈ స్పష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి లోకి టూరిస్టులు రావాలంటే తప్పకుండా కరోనా నియంత్రణ కోసం బూస్టర్ డోసు వేసుకోని తీరాలని తెలిపింది. బూస్టర్ డోసు తీసుకోని వారిని తమ దేశంలోకి రావడానికి ఎలాంటి అనుమతులు ఉండవని అబుదాబి స్పష్టం చేసింది.
అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా తో పాటు ఓమిక్రాన్ వేరియంటు వ్యాప్తి తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. పలు దేశాలలో ఓమిక్రాన్ వేరియంటు కారణంగా లక్షల సంఖ్య లో కరోనా కేసులు వస్తున్నాయి. దీంతో అబుదాబి ఈ నిర్ణయం తీసుకుంది. తమ నగరంలో విదేశాల నుంచి వచ్చే వాళ్ల నుంచే కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంటు సోకుంతుందని తెలిపింది. దీన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అబుదాబి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.