తెలంగాణ ఆర్టీసీ పై కేసీఆర్ ది ఎన్నికల కపట ప్రేమ .. !

-

మొన్న జరిగిన తెలంగాణ కాబినెట్ మీటింగ్ లో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలలో ఆర్టీసీ కార్మికులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించడం మరియు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం. ఈ విషయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్ ను ఒక స్థాయిలో పొగిడేస్తున్నారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్సీకి రాములు నాయక్ కొన్ని కీలకమైన వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఆర్టీసీపై కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎన్నికలు అనే కపట ప్రేమ ఉందని తెలిపారు. కేసీఆర్ వీరిని మరోసారి మోసం చేయడానికి పూనుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాములు నాయక్ చెప్పారు. వచ్చే ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కడ తనకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారన్న భయంతోనే కేసీఆర్ ఈ పనిచేశారని అన్నారు. ఇంతకు ముందు ఒకసారి విలీనం చేయడం సాధ్యం కాదని చెప్పిన కేసీఆర్ కొత్తగా ఈ డ్రామా ఎలా సాధ్యమయిందో ప్రజలు ఎరుగాలన్నారు.

ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే సమయంలోనే తీసుకునే ఉంటే 38 మంది కార్మికులు సజీవంగా ఉండేవారు అంటూ రాములు బాధపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version