మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్: ఆర్టీసీ ఆస్తులనే అమ్మే ప్లాన్ లో కేసీఆర్

-

తెలంగాణ కాబినెట్ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం. అందులో భాగంగా ఇకపై ఆర్టీసీ కార్మికులు అంతా ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కేసీఆర్ గురించి ఒక ఊహించలేని వాస్తవాన్ని తెలియచేశారు. ఈయన మాట్లాడుతూ ఈ కొద్దీ రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి విచిత్రమైన లేదా అసాధ్యమైన నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ ఎన్నికల కోసమే అని ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. ఇంకా కేసీఆర్ ఆర్టీసీ ని విలీనం చేసుకోవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందన్నారు. ఆర్టీసీ కి సంబంధించిన ఆస్తులను సైతం అమ్ముకోవడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని రాములు నాయక్ తెలిపారు. ఇవన్నీ తెలిసిన ఆర్టీసీ కార్మికులు ఈయన తీసుకున్న నిర్ణయం పట్ల ఎవ్వరూ పాలాభిషేకం చేయలేదు, కేవలం స్థానిక ఎమ్మెల్యేలు మాత్రమే హడావిడి చేస్తున్నారంటూ రాములు నాయక్ కేసీఆర్ కుటిల రాజకీయాన్ని బయటపెట్టారు.

ఆర్టీసీ కి చెందిన ఉద్యోగులు కేసీఆర్ కుట్రలను తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ మెలోకొలుపు వ్యాఖ్యలు చేశారు రాములు నాయక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version