పన్నుల ద్వారా వచ్చే ప్రతి రూపాయి అట్టడుగు వర్గాల కోసం : మంత్ర హరీశ్‌ రావు

-

గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్ర సొంత రాబడుల వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. పారదర్శక పాలనతోనే ఈ తరహా వృద్ధి రేటు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ శివారులోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ మేధోమథన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కేసీఆర్ పారదర్శక పాలనతోనే ఈ తరహా వృద్ధి రేటు సాధ్యమైందని చెప్పారు.రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 2022-23లో రూ.72,564 కోట్ల పన్నుల వసూలుతో లక్ష్యాన్ని సాధించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన ఖర్చు కోసం ధనాన్ని సమీకరించడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలకమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల కోట్లకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో పన్ను ద్వారా వచ్చే ప్రతి రూపాయి అట్టడుగు వర్గాల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version