తెలంగాణ రాష్ట్రం.. భార‌త్‌లో లేదా..? : కేంద్రంపై మంత్రి కొప్పుల ఫైర్

-

పార్ల‌మెంట్ వేదిక‌గా.. తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తి స్థాయిలో వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌లేమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం చేసిన ఈ ప్ర‌క‌ట‌నపై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం.. భార‌త దేశంలో లేదా… అని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఏం పాపం చేశార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు.

పంజాబ్ రాష్ట్రానికి ఒక న్యాయం.. తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయ‌మా అని మండి ప‌డ్డారు. పంజాబ్ తో పాటు ఇత‌ర రాష్ట్రంల్లో వ‌రి ధాన్యం కొనుగోలు చేసి.. తెలంగాణ రాష్ట్రంలో వ‌రి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయ‌రో కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చేప్పాల‌ని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా రైతులు పండించిన 100 శాతం పంట‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. వ‌న్ నేషన్.. వ‌న్ ప్రోక్యూర్ మెంట్ ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంట‌ను 100 శాతం కొనుగోలు చేసే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version