వివాదాస్పదం అయిన దేత్తడి హారిక నియామకం.. సీఎంవో సీరియస్ !

-

నిన్న తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికని నియమిస్తూ  తెలంగాణ టూరిజం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ నియామకం వివాదాస్పదం అయింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా మహిళ దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ లో పాల్గొన్న హారిక ను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా మీడియాకి విడుదల చేశారు.

నిజానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంవో అధికారులకు తెలియకుండా హరికను ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమించినట్టు తెలుస్తోంది. దీంతో ఉప్పల శ్రీనివాస్ గుప్తాను సీఎంవో అధికారులు మందలించినట్టు చెబుతున్నారు. దీంతో హారిక డీటెయిల్స్ ను టూరిజం శాఖ వెబ్సైట్ నుంచి అధికారులు తొలగించినట్టు చెబుతున్నారు. నిజానికి గతంలో ఈమెను అనౌన్స్ చేయక ముందు సామాల వేణు అనే మెజీషియన్ అంబాసిడర్ గా ఉండేవారు, అంతకు ముందు సానియా మీర్జా కూడా అంబాసిడర్ గా ఉన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version