అన్లాక్ 5 గైడ్ లైన్స్ ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలోని కంటైన్‌మెంట్ జోన్లలో అక్టోబరు 31వ తేదీ వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని కళాశాలలు, ఉన్నత విద్యాలయాలు ఈ నెల 31 వరకు ఆన్‌లైన్ తరగతులనే కొనసాగించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల పునఃప్రారంభంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు స్కూల్స్ ఓపెన్, సినిమా థియేటర్ ల ఓపెన్ ఎప్పుడు అనేది ప్రత్యేక జీఓల ద్వారా ప్రకటించనున్నారు.
డి-స్కాలర్, ల్యాబ్ పీజీ కోర్సులను అందిస్తున్న ఉన్నత విద్యాలయాలు ఈ నెల 15 నుంచి తెరుచుకోవచ్చని పేర్కొన్నారు. అలానే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు గాను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 15 నుంచి ఈతకొలనులు తెరిచేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అలానే కంటైన్మెంట్ జోన్ల బయట 100 మందితో కూడిన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు. అలానే మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలున్న వారు ఇళ్లలోనే ఉండాలని అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని పేర్కొన్నారు.