తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు..ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంటీరియర్ కర్ణాటక నుండి విదర్బల మీదుగా బలహీన పడిన ద్రోణి.. దక్షిణ – ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు క్రింది స్థాయి గాలులు.. వీస్తున్నాయి.
దీంతో ఈ నెల 15 వ తేదీ వరకు వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు హైదరాబాద్ నగర వాసులకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కాగా, హైదరాబాద్ లో పలుచోట్ల నిన్న భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. బాలానగర్ 10.4cm, బొల్లారం 9.6cm, తిరుమల గిరి 9.5cm, వెస్ట్ మరేడుపల్లి 9.3cm, కుత్బుల్లాపూర్ 9.2cm, కూకట్ పల్లి 7.7 cm, ముసాపేట 7.6cm, కొండాపూర్ 7.4cm, మొండా మార్కెట్ 7.2cm, మల్కాజిగిరి 7cm వర్షపాతం నమోదు అయింది.