కేసీఆర్ ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలం అయ్యాయి. నిన్న రాత్రి సీఎస్ సోమేశ్ కుమార్ తో విఆర్ఏల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే సమ్మె విరమిస్తున్నట్లు వీఆర్ఏ జేఏసీ ప్రకటన చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి విధుల్లోకి వెళ్లనున్నారు వీఆర్ఏలు.
VRAలు గత 80 రోజులుగా వారి హక్కుల కోసం ఉద్యమం చేశారని.. Vra హామీలు పే స్కేల్,ఉద్యోగ భద్రత, ప్రమోషన్, కారుణ్య నియామకాలు అమలు చేస్తామని సీఎం కేసిఆర్ హామీ ఇచ్చారని వెల్లడించారు ట్రేసా ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి.
Vra లు ఇవాళ్టి నుండి విధుల్లోకి చేరుతారని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల కోడ్ ఉన్నందున vra లకు ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేయలేక పోతున్నాము..మునుగోడు ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత vra లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రకటన చేశారు. సమ్మె కాలం జీతం, దానితో పాటు సమ్మె చేస్తున్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం వంటి వాటిపై మునుగోడు తరువాత అమలు చేస్తామన్నారు ట్రేసా ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి.