BREAKING : తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖతంలో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది.
నిన్న రాజస్థాన్ & పరిసర ప్రాంతం నుండి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ చ్ఛాట్టిస్ ఘడ్ మరియు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖతం వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీన పడింది.
ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీన పడింది. ఈ నేపథ్యంలో రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.