తెలంగాణను చలి వనికిస్తోంది. మెల్లిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రభావం కనిపిస్తుండగా ప్రజలు వనికిపోతున్నారు. సోమవారం నుంచి ఈనెల 29 వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కొన్ని చోట్ల పది డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని కొమురం భీమ్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు మరో ఎనిమిది జిల్లాలను హెచ్చరించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 15 నుంచి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో 16 నుంచి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.