5.5 కిలోల శిశువు జననం..! డాక్టర్లనే ఆశ్చర్యానికి గురిచేసిన బాలభీముడు..!

-

సాధారణంగా శిశివులు 2.5 నుండు 3.5 కిలల బరువుతో పుడతారు. కానీ ఓ తల్లికి బాలభీముడే పుట్టాడు, డాక్టర్లు కూడా నోరెళ్ళబెట్టారు. ఆసుపత్రిలో ఉన్న చుట్టుపక్కవాళ్లు ఆశ్చర్యపోయారు.

5.5 kilo baby boy born in telangana

 తెలంగాణలోని నిర్మల్‌ ప్రసూతి ఆసుపత్రిలో ఓ తల్లి 5.5 కిలోల శిశువుకి జన్మనిచ్చింది. నిర్మల్ లోని సోన్ మండలానికి చెందిన నేహా అనే గర్భం దాల్చిన మహిళకు నొప్పులు రావడంతో దగ్గర్లోని ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. సిజేరియన్‌ పద్ధతిలో ప్రసవం చేయడం సరికాదని భావించిన వైద్యులు నార్మల్ పద్ధతినే అనుసరించారు. కానీ లోపల బుడతడు బాల భీముడు. ఈ బాల భీముడు బయటకు రాకపోయేసరికి శాస్త్రచికిత్స చేసి శిశువును బయటకు తీశారు. శిశువును చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇంత బరుతో శిశువు జన్మించడం అరుదని వారు నేహా కుటుంబానికి తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version