యూత్ ఎందుకు నమ్మడంలేదబ్బా ..? కేసీఆర్ బాధ ఇంతింతకాదయా ! 

-

అచ్చమైన తెలంగాణ యాస, భాషలతో కెసిఆర్ అందరినీ ఆకట్టుకుంటారు. ప్రజల నాడి ఏ విధంగా ఉందో ముందుగానే అంచనా వేసి, దానికి అనుగుణంగా రాజకీయం నడుపుతూ, సక్సెస్ లీడర్ గా పేరుగాంచారు. టిఆర్ఎస్ స్థాపించిన దగ్గర నుంచి రెండోసారి అధికారం దక్కించుకున్న తరువాత కెసిఆర్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఎప్పటికప్పుడు వ్యూహాత్మక రాజకీయాలతో మీ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీస్తూ, ప్రజలను తమ వైపు తిప్పుకుని సక్సెస్ ఫుల్ నాయకుడు ఆయన పేరు సంపాదించుకున్నారు. అటువంటి కెసిఆర్ ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, కేంద్రంతో సైతం మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తూ, ప్రజల మేలు కోసం కష్టపడుతుంటే, ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయం కేసీఆర్ కు అర్థం కావడం లేదు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నాలుగు ఎన్నికలు ఉండడంతో, కెసిఆర్ మరింత అప్రమత్తంగా ఉంటూ, ఈ నాలుగు ఎన్నికలలోనూ టిఆర్ఎస్ కు విజయం దక్కే విధంగా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా యువతలో టిఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, టిఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయం నుంచి యువత , విద్యావంతులు ఉద్యోగస్తులు ఇలా అంతా టిఆర్ఎస్ కు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు పలికారని, ఇప్పుడు ఎందుకు నమ్మడం లేదంటూ పార్టీ నాయకుల వద్ద కేసీఆర్ ఆరా తీస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకతను పెంచేందుకు యువత, విద్యావంతులు, ఉద్యోగస్తుల్లో వ్యతిరేకతను పెంచేందుకు రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టిఆర్ఎస్ శ్రేణులు వీటి తిప్పికొట్టాలని సూచించారు.

ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న సంస్కరణలు ప్రజలకు అర్థమయ్యే విధంగా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలపై ప్రజలకు ఉన్న అనుమానాలను తీర్చి, వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, రాజకీయ ప్రత్యర్ధులు చేసే విమర్శలను తిప్పి కొట్టాలని కేసీఆర్ సూచించారు. యువత విద్యావంతులు, ఉద్యోగస్తులలో నమ్మకం పెంచే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మేలు జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులపైనే ఉందని సూచిస్తున్నారు.

దుబ్బాక గ్రేటర్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ వైపు విజయం ఉండేలా, జనాల్లో పార్టీ పలుకుబడి పెంచే విధంగా నాయకులు కృషి చేయాలని, ఈ ఎన్నికల వ్యవహారాలను పార్టీ నాయకులు అంతా సీరియస్ గా తీసుకుని, అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రభుత్వంపై నమ్మకం పెంచే విధంగా చేయాలని కేసీఆర్ పదేపదే సూచిస్తున్నారు. అసలు ఏ విషయాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది అనే విషయాన్ని గుర్తించి, ఆ సమస్యలను పరిష్కరించే విధంగా పార్టీ నాయకులు కృషి చేయాలని, యువతను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే విషయాలపైన కెసిఆర్ ఇప్పుడు పార్టీ శ్రేణులతో చర్చిస్తున్నారట. కేసీఆర్ తీరు చూస్తే, ప్రభుత్వ తీరుపై యూత్ లో వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని ఆయన గుర్తించి, నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు గా కనిపిస్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version