గౌరవెల్లి ప్రాజెక్టు వివాదంపై మంత్రి హరీష్‌ రావు కీలక ప్రకటన

-

గుండాటి పల్లి భూనిర్వాసితుల పై మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. గౌరవేల్లి ప్రాజెక్ట్ విషయం లో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ చేస్తున్నాయి, గతంలో మల్లన్న సాగర్ విషయంలో కూడా ఇలాగే చేశారని.. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా హరీష్‌ రావు పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వం వస్తున్న మంచి పేరును తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని.. కోర్టులో కేసులు పెట్టి ,నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు. నిర్వాసితులు ఎవరినైన బలవంతంగా ఇల్లు కలిచేయించార ,అధికారులు ఇంజినీర్ అధికారుల ఇబ్బందుల కు గురిచేశారని.. రేగొండ లో ఇంజినీర్ లు పనులు చేసుకుంటే అధికారుల విధులకు ఆటంకం కలిగేస్తే వాళ్ళు పోలీసులు ను ఆశ్రయించారన్నారు. గతంలో కూడా అధికారులు వచ్చి బాధితులు తో చర్చలు జరిపారని.. మీడియా కు కూడా వాస్తవాలు రాయండని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూనిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వీడల న్యాయం చేస్తారు.

3816 ఎకరాలు భూసేకరణ చేశారు, కేవలం 84 ఎకరాల రైతులు కోర్టుకు వెళ్లడంతో వాళ్లకు ఇవ్వాలిసిన డబ్బులు బ్యాంక్ లో జమ చేసి ప్రభుత్వం ప్రోజెక్టుల పనులకు ముందుకు పోతుందని చెప్పారు. 97.82 శాతం మంది రైతులకు భూమి తెలుసుకొని వారికి డబ్బులు ఇచ్చారు,ఇందుకు 200 కోట్ల రూపాయలు ఇచ్చామని..693 ఇళ్లకు గాను 683 ఇళ్లకు గాను 83 కోట్ల రూపాయలు 2015లో డబ్బులు ఇచ్చామని వెల్లడించారు. 84 మంది రైతులకు 15 లక్షల రూపాయల ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version