తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 07న ఏర్పాటైన విషయం తెలిసిందే. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతున్నప్పటికీ పలు సందర్భాల్లో పాత మంత్రులు, పాత సీఎంనే అధికారం ఉన్నవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రెండు నెలల సమయంలో చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.
తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్ రావు అంటూ ఇంటర్ ప్రశ్నపత్రంలో తప్పు గా ప్రచురించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రంలో ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్ రావు అని పేర్కొంది.. పాత ప్రశ్నను యథావిధిగా క్వశ్చన్ పేపర్‌లో పెట్టడం వల్లే ఈ తప్పు దొర్లినట్లు ఇంటర్ బోర్డుపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం మారి రెండు నెలల కాలం గడిచినప్పటికీ విద్యాశాఖ ఎందుకు ఇలాంటి మార్పులు చేయలేదని పలువురు చర్చించుకోవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అయితే హరీశ్ రావు అంటూ ఇంటర్మీడియట్ బోర్డు అలా ఎలా ప్రచురిస్తుందని చర్చించుకుంటున్నారు.