శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఏసియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలాలంపూర్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వస్తున్న ఎయిర్ ఏసియా విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది.
సాంకేతిక లోపాన్ని పసిగట్టి టీటీసీ అధికారులకు సమాచారం అందించారు పైలట్. ఈ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో విమానంలోని 70 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సంఘటన పై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఏసియా విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.