BREAKING : ఆగస్టు 1వ తేదీ నుంచి పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు మంత్రి సబితా. ఈ పదో తరగతి ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 92.45 శాతం, 87.61 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా వెల్లడించారు.
ఈ సంవత్సరము 3007 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయని.. ఈ సంవత్సరము 15 పాఠశాలలు సున్నా శాతము ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా అన్ని జిల్లాల కంటే 97.85 శాతము ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానములో ఉన్నది… హైదరాబాదు జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతము అనగా 79.63 శాతము సాధించి చివరి స్థానములో ఉన్నదని చెప్పారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.