ఈ రోజు శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండ్యపల్లి వద్ద కూలీ పనుల కోసం మహిళలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడిన ఘటనలో ఐదుగురు సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు లోకేష్. మృతులకు నివాళి అర్పిస్తున్నానని చెప్పారు లోకేష్. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న లోకేష్.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలన్నారు.
తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడిన దొంగలు కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయని మండిపడ్డారు లోకేష్. ఇంకా నయం.. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేదని ఎద్దేవా చేశారు లోకేష్. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయిందని అన్నారు లోకేష్.