తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలెర్ట్. సీఎం రేవంత్ రెడ్డి రేపు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. మొదట అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’పధకం ప్రారంభిస్తారు. అక్కడి నుండి నేరుగా కొండారెడ్డిపల్లికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు.
ఆ తరువాత సీఎం సొంత నిధులు రూ.3కోట్లతో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతర, తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లపై.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు అలాగే స్టీల్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మార్కెట్ రేటు కంటే ఎంత తక్కువగా సరఫరా చేస్తారో చెప్పాలని…. ఇప్పటికే సిమెంట్ కంపెనీలతో అధికారులు సమావేశం నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 320 రూపాయలు సిమెంట్ బస్తా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిమెంట్ బాస్ తో 260 రూపాయలకు ఇచ్చిన ప్లాన్ చేస్తున్నారట.