తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. డిగ్రీలో మరో 15 కొత్త కోర్సులు

-

 

తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా మరో 15 స్కిల్ కౌన్సిల్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 7 కోర్సులను పెట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించగా… కాలేజీల నుంచి విజ్ఞప్తులు రావడంతో వాటి సంఖ్య 22 కు పెంచారు.

విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ తర్వాత అప్రెంటిస్ షిప్ చేయాల్సి ఉంటుంది. మూడో విడత దోస్త్ కౌన్సిలింగ్ లో విద్యార్థులు కొత్త కోర్సులను ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు. ఇది ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version