వేములవాడ దేవాలయం డెవలప్ మెంట్ పరిధిలోకి 152 రెవెన్యూ గ్రామాలు…!

-

152 revenue villages under development of Vemulawada temple: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ పై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఫోకస్ పెట్టింది. వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ పరిధిలోకి 152 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి. అభివృద్ధి కోసం పరిధి పెంచినట్లు ఉత్తర్వులో తాజాఆ పేర్కొంది రేవంత్‌ ప్రభుత్వం. ఈ మేరకు వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వీటిడిఏ పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

152 revenue villages under development of Vemulawada temple.

గతంలో వేములవాడతో పాటు వేములవాడ అర్బన్ మండలం వీటీడీఏ పరిధిలో ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీతో పాటు బోయినపల్లి, ఇల్లంతకుంట,ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి,ముస్తాబాద్, గంభీరావుపేట,చందుర్తి, రుద్రంగి,వేములవాడ రూరల్, కోనరావుపేట మండలాల్లోని 152 రెవెన్యూ గ్రామాలను వీటిడిఏ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇకనుండి ఆయా మండలాల్లోని గ్రామాలు వీటీడీఏ పరిధిలోకి త్వరలో రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version