వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా…తొలిరోజు 18 దరఖాస్తులు అందాయి. సత్తుపల్లి నుంచి పోటీ చేసేందుకు పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ మొదటి దరఖాస్తు అందించగా… వనపర్తి నుంచి పోటీ చేసేందుకు ఎంపీపీ మేఘ రెడ్డి 2వ దరఖాస్తును సమర్పించారు. ఈ నెల 25 వరకు ఆర్జీలు స్వీకరిస్తారు. పరిశీలన అనంతరం అధిష్టానం అర్హుల జాబితాను ప్రకటిస్తుంది.
కాగా,తాజాగా దరఖాస్తుల ఫాంను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, విడుదల చేశారు. ఇక అసెంబ్లీ సీటు ఆశించే వారు డబ్బు కట్టి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక ఎస్సీ, ఎస్టీ ధరఖాస్తుదారులకు రూ.25 వేలు, బీసీ, ఓసీలకు 50 వేల రూపాయల ధరఖాస్తు రుసుముగా ఖరారు చేశారు. ఇక ఇక్కడ రేవంత్ కొత్త మెలిక పెట్టారు. సీటు దక్కితే ఇబ్బంది లేదు..సీటు దక్కని వారికి మళ్ళీ దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదని.. దరఖాస్తు రుసుము పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు.