నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

-

హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రూపొందించిన రిమాండ్ రిపోర్టులో మొత్తం 20 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిందితుల్లో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది వినియోగదారులు ఉన్నారని తెలిపారు. డ్రగ్స్‌ కేసులో ఏ10గా ప్రముఖ సినీ నటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నారని చెప్పారు. నైజీరియా నుంచి దిల్లీ, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేశారని వెల్లడించారు.

‘ఎబుకా, ఆనౌహ బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సప్లై చేశారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోకి డ్రగ్స్ తీసుకొచ్చారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్‌పిన్‌గా నైజీరియాకు చెందిన ఎబుకా సుజి ఉన్నాడు. ఎబుకా నుంచి ఆనౌహ బ్లెస్సింగ్‌ అనే మహిళా ద్వారా డ్రగ్స్ తెలుగు రాష్ట్రాల్లోకి చేరుతున్నాయి. ఇప్పటి వరకు బ్లెస్సింగ్  20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చింది. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా హైదరాబాద్‌, రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి. 9 నెలల్లో నైజీరియన్ రూ.10 లక్షలు కమీషన్‌గా గౌతమ్‌కు ఇచ్చాడు.’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version