తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలోని 14 వైద్య కళాశాలల్లో 201 ట్యూటర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.
వీటిని కాంట్రాక్టు ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. వైద్య, విద్య సంచాలకులు పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇచ్చింది. కాంట్రాక్టు ట్యూటర్లను ఈ మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ ఉద్యోగులతో పోస్టులు భర్తీ అయ్యేవరకు కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కొక్కరికి అన్ని భత్యాలు కలిపి రూ.57,700 నెలవారి వేతనాలు చెల్లిస్తామని తెలిపింది.