జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో ఇవాళ నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురు మైనర్స్ జువెనల్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏ-1 నిందితుడు సాదిధ్ధున్ మాలిక్ మూడు రోజుల కస్టడీకి ఈ సందర్భంగా అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు.
ఈ నెల 9 నుండి 11 వరకు కస్టడీలోకి అనుమతించిన నాంపల్లి కోర్టు.. మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచాలని పేర్కొంది. రేపు చంచల్ గూడ జైల్ నుండి మాలిక్ ను కస్టడీలోకి తీసుకోనున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. ఈ నెల 9 నుండి 11 వరకు కస్టడీలో ఉంచనున్నారు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ రేప్ కేసుపై రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోయల్ డెవిస్ తో నాకు పంచాయతీ ఏమి లేదని.. జోయల్ డెవిస్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి… ఎమ్మేల్యే కొడుకు లేడని ఎవరు ఒత్తిడితో జోయల్ డెవిస్ ప్రకటించారన్నారు. CP చాలా అంశాల పై క్లారిటీ ఇవ్వలేదని.. ఇన్నోవా, బెంజ్ ల యజమానులు ఎవరు అని ప్రశ్నించారు. ఇన్నోవా ప్రభుత్వ వాహనం అయితే డ్రైవర్ ఎందుకు లేడు.. కొన్ని విషయాలు దాచి బెడుతున్నారని అనుమానం ఉంది..హోమ్ మినిస్టర్ మనవడు కి సంబందించిన ఆధారాలు ఇవ్వాలని పోలీస్ లు అడిగితే ఇచ్చేందుకు నేను సిద్దమని పేర్కొన్నారు.