ధరణి వచ్చాక 3 లక్షల ఎకరాల భూములను గుంజుకున్నారు – మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

-

తెలంగాణ ప్రజలను కెసిఆర్ అడుగడుగునా మోసం చేస్తున్నాడని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు ఇవ్వవలిసిన పోడు భూములు ఇవ్వటం లేదన్నారు. కొమరం బీమ్ జిల్లాలో పోడు భూములకు పట్టాలు ఇస్తాం అని ఇంకా ఇవ్వలేదన్నారు. 4 లక్షల ధరకాస్తుదారులు ఉంటే,1లక్ష 50 వేలు పట్టాలు ఇచ్చి కేసీఆర్ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములు లాక్కొని వారిని అన్యాయంగా జైలుకి పంపిస్తున్న సందర్భాలు చూస్తున్నామన్నారు. హరిత హారంతో ఎన్ని చెట్ల నాటారు అనేది శ్వేత పత్రం విడుదల చేయ్యాలని డిమాండ్ చేశారు. హరిత హారం పేరిట భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు రాములు నాయక్. ఇందిరా గాంధీ ఇచ్చిన అసెండ్ ల్యాండ్ లను గుంజుకుని ప్రైవేట్ ఇండస్ట్రీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు.

ఎక్కడైనా ప్రభుత్వాలు భూములు ప్రజల వద్ద తీసుకుంటే బదులుగా భూములు ఇస్తారు.. లేక పొతే అక్కడ నెలకొనే ఇండస్ట్రీస్ లో జాబ్ కల్పిస్తారు.. కానీ కెసిఆర్ సర్కార్ లో అలాంటి అవకాశం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీల వద్ద అసెండ్ భూములు గుంజుకున్నరని.. ఎక్కడ ఎన్ని భములు తీసుకున్నారానేది ఒక శ్వేత పత్రం విడుదల చెయ్యాలన్నారు. ఇందిరా గాంధి పేదవారికి ఇచ్చిన భూములతో కెసిఆర్ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందన్నారు. ధరణి వచ్చాక 3 లక్షల ఎకరాల భములు గుంజుకున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version