రెండు రోజుల ముందు వన్ డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా జింబాబ్వే మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ అనూహ్యంగా ఘోర ఓటమిని పొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ వైఫల్యానికి కారణమైన వారిపై ఆ జట్టు యాజమాన్యం కొరడా జులిపించింది. వెస్ట్ ఇండీస్ వన్ డే జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆల్ రౌండర్ రావ్ మాన్ పావెల్ పై ఈ రోజు మ్యాచ్ కు వేటు వేసింది. ఈ మ్యాచ్ పావెల్ కీలక దశలో బ్యాటింగ్ కు వచ్చి కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. దీనితో ఆ తర్వాత ఎవ్వరూ వికెట్ ను కాపాడుకోలేక జింబాబ్వే చేతిలో ఓడిపోయారు.