కేసీఆర్ టచ్ లోకి 5 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..?

-

తెలంగాణ రాష్ట్రంలో పెను సంచనాలు నమోదు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు…. ఎలాగైనా కేసీఆర్ ను కలిసేందుకు… విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనం నేషనల్ మీడియాలో ప్రచురణ అయింది. ఆ కథనం ప్రకారం… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు… గుర్తించారట.


ఆ పార్టీలో ఉంటే… మునగక తప్పదని… భావిస్తున్నారట. ఇందులో భాగంగానే కెసిఆర్ ను కలిసేందుకు వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు… వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశం కేసీఆర్ వద్దకు రావడంతో ఆయన తిరస్కరించారట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ తమకు వద్దని తేల్చి చెప్పారట. ఎన్నికల వరకు.. పోరాడి అప్పుడు గెలుస్తామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అప్పటివరకు ఎలాంటి పార్టీ చేరికలు ఉండవని కూడా వివరించారట కేసీఆర్. అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నుంచి వెళ్లినవారా ? లేక.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా గెలిచినవారా ? అనేది తేలాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version