వాహ్.. హైదరాబాదీలు 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆరగించారంట

-

హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమసో కొత్తగా చెప్పనక్కర్లేదు. వివిధ రాష్ట్రాల ప్రజలకే కాదు.. విదేశీయులకు కూడా మన హైదరాబాద్ బిర్యానీ ఫేవరెట్. భాగ్యనగరానికి వచ్చిన కొత్త వాళ్లెవరూ బిర్యానీని టేస్ట్ చేయకుండా వెళ్లరు. అంత ఫేమస్ మరి హైదరాబాద్ బిర్యానీ. అయితే ఆహా ఏమి రుచి.. తినరా బిర్యానీ మైమరచి.. అనుకుంటూ హైదరాబాద్ నగరవాసులు బిర్యానీని తెగ తింటున్నారట.

ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆరగించారట మన భాగ్యనగర ప్రజలు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఇచ్చిన ఆర్డర్లే. రెస్టారెంట్‌లో, ఇంట్లో తినేవారిని కలిపితే ఈజీగా కోటి దాటుతుంది. జులై 2 ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా స్విగ్గీ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రతి ఐదింటిలో ఒకటి హైదరాబాద్‌ బిర్యానీ ఆర్డరే కావడం విశేషం. ఎక్కువగా కూకట్‌పల్లి ప్రజలు బిర్యానీ ఆరగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో మాదాపూర్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి ప్రాంతాలు ఉన్నాయి. నగరవ్యాప్తంగా 15 వేల రెస్టారెంట్లు బిర్యానీ రుచులను అందిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version