టన్నెల్‌లో చిక్కుకున్న వారు బతికే ఛాన్స్ లేదు అంటూ రెస్క్యూ టీమ్ అధికారులు చెబుతున్నారు. SLBC టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, కార్మికులు బతికే ఛాన్స్ లేదని అధికారులు చెబుతున్నారు. వారంతా TBM మెషీన్ చుట్టూ బురదలో కూరుకుపోయి చనిపోవచ్చని భావిస్తున్నారు.
నిన్న(బుధవారం) రెస్క్యూ టీమ్ టన్నెల్ చివరి వరకు వెళ్లి చూడగా.. ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదని తెలిపారు. లోపల కూలిన మట్టి, రాళ్లను తీయాలంటే ఏడాదిపైనే పడుతుందన్నారు.