తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. పట్టభద్రులు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్ అదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. అటు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలా తెలంగాణలో ఒకేసారి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
అటు ఏపీలో కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఏపీ కంటే తెలంగాణలో జరిగే ఎన్నికల పైన అందరూ దృష్టి సారించారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి… సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.