స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు.. సింగరేణి ఉత్తర్వులు జారీ

-

 

సింగరేణి ప్రాంతంలో ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త అందింది. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి సంస్థలో కాంట్రాక్టర్లు చేపట్టే పనుల్లో స్థానికులకే 80 శాతం కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సిఎం రేవంత్‌ రెడ్డిని కోరారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్.

Telangana government sweet talk for Singareni workers

ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్క్యులర్ జారీ చేశారు సింగరేణి డైరెక్టర్ బలరాం. దీంతో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి ఫలించినట్లు అయింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ…సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు మైనింగ్ మరియు పవర్ ప్లాంట్‌లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టులన్నింటిలో 80 శాతం స్థానికులకే ఉద్యోగాలివ్వాలని సింగరేణి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఎన్నికల ప్రచారంలో నేను చేసిన వాగ్దానాలలో ఇది ఒకటి అని తెలిపారు. తగు సూచనలు ఇచ్చినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు వివేక్ వెంకట స్వామి

Read more RELATED
Recommended to you

Exit mobile version