హైదరాబాద్ లో వ్యాపార వేత్త దారుణ హత్య..ఊటీలో సగం కాలిన శవం !

-

హైదరాబాద్ లో వ్యాపార వేత్త దారుణ హత్య జరిగింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్త రమేష్ (54) కుమార్ హత్య జరిగింది. హైదరాబాద్ లో హత్య జరుగగా..ఊటీ ఎస్టేట్ లో శవానికి నిప్పు పెట్టారు. ఉప్పల్- భువనగిరి ప్రాంతం లో హత్య చేసి..బాడీ ను కర్నాటక పరిధి లోని కొడగు కాఫీ ఎస్టేట్ లో తగుల బెట్టారు భార్య నీహారిక, అమె ప్రియుడు డాక్టర్ నిఖిల్. కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన కర్ణాటక పోలీసులు..ఈ కేసును తేల్చారు.

మెర్సిడెస్ బెంజ్ కార్ లో రమేష్ శవాన్ని హైదరాబాద్ నుండి ఊటీ దగ్గర వున్న కాఫీ ఎస్టేట్ కి తీసుకెళ్లింది నీహారిక. 8 కోట్ల రూపాయల ఆస్తి కోసమే నీహారిక భర్తను హైదరాబాద్ లో హత్య చేయించినట్టు విచారణ లో తేల్చారు కర్ణాటక పోలీసులు. రమేష్ ను హత్య చేసిన..కాఫీ ఎస్టేట్ లో తగుల బెట్టిన రాణా అనే నిందితుడిని హర్యానా లోని ఓ డాబా వద్ద టీ తాగుతుండగా అరెస్టు చేశారు కర్ణాటక పోలీసులు. ఇక డాక్టర్ నిఖిల్ మైరెడ్డి ది ఏపి లోని‌ కడప జిల్లా అని తేల్చారు. మృతుడు రమేష్ ది హైదరాబాద్ అని… నీహారిక ది యాదాద్రి జిల్లా అని గుర్తించారు. ఈ కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version