రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది…ఆందోళన చేసిన 39 మంది కానిస్టేబుళ్లు సస్పెండ్ చేసింది సర్కార్. రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. బెటాలియన్స్ లో ఆందోళన చేసిన కానిస్టేబుల్ పై వేటు వేశారు. 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపింది పోలీస్ శాఖ.
బెటాలియన్స్ లో అశాంతిని సృష్టించి అల్ల కల్లోలం చేయాలని కుట్ర చేశారని ఆరోపణలు చేసింది పోలీస్ శాఖ. 39 కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన అధికారులు..ఈ మేరకు ప్రకటన చేశారు. మూడు నాలుగు ఐదు ఆరు 12 13 17 బెటాలియన్స్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పై పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ గల ఫోర్సులో ఆందోళన చేసి మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారట కానిస్టేబుల్. అందుకే 39 మంది కానిస్టేబుళ్లు సస్పెండ్ చేసింది సర్కార్.