ఆర్టీసీ బస్‌లో జ‌న్మించిన చిన్నారికి జీవితకాలం రాష్ట్ర‌వ్యాప్తంగా ఉచిత బస్ పాస్

-

రాఖీ పౌర్ణమి నాడు గ‌ద్వాల డిపోన‌కు చెందిన ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు TGSRTC యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

అలాగే కండ‌క్ట‌ర్‌తో పాటు గ‌ర్భిణి డెలివ‌రీకి సాయం చేసిన వ‌న‌ప‌ర్తిలోని మ‌ద‌ర్ అండ్ చైల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్ స్టాఫ్ న‌ర్స్ అలివేలు మంగ‌మ్మకు డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్ర‌యాణించే బ‌స్ పాస్‌ను సంస్థ అందించింది. బ‌స్సులో ప్ర‌యాణిస్తున్నప్పుడు పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్బిణికి కాన్పు చేసి మాన‌వ‌త్వం చాటుకున్న గ‌ద్వాల్ డిపోన‌కు చెందిన కండ‌క్ట‌ర్ భార‌తి, డ్రైవ‌ర్ అంజిల‌తో పాటు న‌ర్సు అలివేలు మంగ‌మ్మ‌ను హైదరాబాద్ బస్ భవన్ లో మంగ‌ళ‌వారం టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించి.. న‌గ‌దు బ‌హుమ‌తులు అంద‌జేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version