తెలంగాణ ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ అలాగే సర్వీస్ అటు బీమా రంగాలలో ఇంజనీరింగ్ మరియు డిగ్రీ విద్యార్థులకు శిక్షణ… ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 10,000 మంది ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ విద్యార్థులకు… నైపుణ్య శిక్షణ ఇచ్చేలా… ఒక ప్రత్యేకమైన కోర్సును తీసుకువస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా ప్రత్యేకమైన.. కోర్సు తీసుకురావడం.. దేశంలోనే తొలిసారి అని చెబుతున్నారు.
దీనిని ఈనెల 25వ తేదీన స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరుగుతుంది. 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలలో అమలు చేసి ఈ కోర్సు పూర్తయిన వారికి… ఉద్యోగ కల్పన సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వారికి సర్టిఫికెట్ తో పాటు, ఇంటర్ షిప్ కూడా ఇవ్వనున్నారట. దీంతో ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ విద్యార్థులు సంబరపడిపోతున్నారు.