కేటీఆర్ ఇలాఖాలో టిఆర్ఎస్ పార్టీకి షాక్.. పార్టీ వీడనున్న కీలక నేత

-

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇలాఖాలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సెస్ మాజీ వైస్ చైర్మన్, సామాజిక సేవా కార్యకర్త లగిశెట్టి శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. లగిశెట్టి శ్రీనివాస్ ఇప్పటికే పలు వార్డుల్లో పద్మశాలి యూత్ నేతలు, అసంతృప్తి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి బిజెపిలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు బిజెపిలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని సైతం కలిసి పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. పట్టణంలోని ఓ వర్గం లగిశెట్టిని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లగిశెట్టి శ్రీనివాస్ పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version