KTRకు మరో షాక్..ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో వివరాలను ఈడీ కి అందజేసింది ఏసీబీ. ఆర్థిక శాఖ రికార్డ్స్, HMDA చెల్లింపుల వివరాలు, HMDA చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు FIR ఈడీ కి అందజేసిన ఏసీబీ…. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో కీలక అంశాలను ప్రస్తావన చేసిన ఏసీబీ…. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని కౌంటర్లో పేర్కొంది.
క్యాబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశాడని…. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని తెలిపారు. దీనివలన హెచ్ఎండిఏ కు 8 కోట్లు అదనపు భారం పడిందన్నారు. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అంటూ పేర్కొంది. కేటీఆర్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన ఏసిబి… రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామనడం సరైనది కాదని తెలిపింది. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించారని… ఎఫ్ఈఓ కు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు తానే చెప్పాడని పేర్కొంది.