తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబడుతుంది : ప్రధాని మోడీ

-

మహబూబాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడారు. నా కుటుంబ సభ్యులారా అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబడుతుంది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పబోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయని తెలిపారు. తెంగాణకు తరువాత సీఎం బీజేపీ నుంచి రాబోతున్నారు. తెలంగాణ తొలి బీజేపీ సీఎం అవ్వనున్నారు. అందులో బీసీకీ చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కానున్నారు. తెలంగాణ ప్రజలపై నమ్మకం బీజేపీపై ఉందన్నారు.బీజేపీ వాగ్దానం బీసీకిచెందిన వాడు సీఎం అవుతాడు. అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తుంది. మోడీ గారి గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారెంటీ అని తెలిపారు ప్రధాని. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నాతో కలిసి ప్రాధేయపడ్డారు.ః

బీజేపీ తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆయనతో కలువలేదు. బీఆర్ఎస్ ని బీజేపీ ఎప్పుడూ కూడా దగ్గరకి రానీయదు. మా దరిదాపుల్లోకి కూడా బీఆర్ఎస్ ని రానివ్వం.. ఇది మోడీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. కానీ కేసీఆర్ డిసెంబర్ 03న ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పాారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version