అంధవిశ్వాసంతో కేసీఆర్ సచివాలయాన్ని కూల్చారు: మోదీ

-

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​కు అంధవిశ్వాసాలపై నమ్మకం ఎక్కువ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంధవిశ్వాసాలను నమ్మి సచివాలయాన్ని కూల్చారని మండిపడ్డారు. తన మూఢనమ్మకాలతో కేసీఆర్‌ ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. మూఢనమ్మకాలకు బానిస అయిన ఈ సీఎం అవసరమా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకి రాని ఈ సీఎం మనకు అవసరమా? అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మహబూబాబాద్ విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. తెలంగాణలో మొదటిసారి కాషాయ ప్రభుత్వం ఏర్పడుతుందని.. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ… అని ప్రధాని తెలుగులో చెప్పారు.

“బీఆర్ఎస్ అవినీతిపరులను జైలుకు పంపిస్తామని సంకల్పం తీసుకున్నాం. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపేది తెలంగాణ బీజేపీ సర్కార్‌. రెండుపడక గదులు ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని జైలుకు పంపేది తెలంగాణ బీజేపీ సర్కార్‌. తెలంగాణను కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ మాత్రమే నాశనం చేశాయి. బీజేపీ మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచితస్థానం ఉంటుంది. గతంలో కేసీఆర్‌ దిల్లీకి వచ్చి బీజేపీతో కలుస్తామని అడిగారు. తన వారసుడిని సీఎంగా చేస్తే.. బీజేపీతో కలుస్తామని కేసీఆర్ అడిగారు. కేసీఆర్‌ విజ్ఞప్తిని తిరస్కరించడంతో బీజేపీని తిట్టడం మొదలుపెట్టారు.” అని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version